Skip to main content

Telugu News Power

లస్కర్లకు వేతనాల పెంపు.

లస్కర్ల సమస్యలపై మండలి లో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల.
మంత్రి నిమ్మలకు కృతజ్ఞతలు తెలుపుతున్న లస్కర్ లు

పాలకొల్లు: మార్చి, 2 (తెలుగు న్యూస్ పవర్. కాం) రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు, నిమ్మల రామానాయుడు, జలవనురుల శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న లస్కర్ల సమస్యలను మండలిలో ఇటీవల ప్రస్తావించారు. లస్కర్లకు వేతనాల పెంపు, రిటైర్ అయిన వారి స్థానంలో కొత్తవారిని ఔట్సోర్సింగ్ విధానాల్లో భర్తీ చేయడం వంటి అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా లస్కర్లు మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం కలుసుకుని, కృతజ్ఞతలు తెలియజేశారు. గత 10 ఏళ్లుగా కేవలం 6 వేల జీతం పై పని చేస్తున్న తమకు, 10 వేలకు పెఃచారని, మళ్లీ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని 16 వేలకు పెంచడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే 18 వేలకు పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఔట్సోర్సింగ్ ద్వారా ఖాళీగా ఉన్న లస్కర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు.