Telugu News Power

ప్రభుత్వ ఔషధ పంపిణీ విధానం లోపభూయిష్టం – ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్.

అమరావతి: మార్చి,3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ ఆసుపత్రుల్లో పంపిణీ చేసే ఔషధ విధానం లోపభూయిష్టంగా ఉందని పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఇంకా రవీంద్రనాథ్ తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రశ్నకు సంబంధించి మండలిలో ఆరోగ్యశాఖ మంత్రి ఇచ్చిన సమాధానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేద ప్రజలకు అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చే మందులపై వారు ఇచ్చిన సమాధానం మొక్కుబడిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గడువు మీరిన మందులు ఆరు నెలలకు ముందే సరఫరా చేసిన కంపెనీకి ఇచ్చి వేయాలనే విధానం ఎక్కడ పాటించడం లేదని వెల్లడించారు. తీసుకున్న మందులు సరిగా కరగకపోవడం వల్ల రోగం తగ్గకపోగా, పేద రోగులు దీర్ఘకాలం రోగాన పడి, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి,ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. ఏ మందులు సరిగా పనిచేయటం లేదు తెలుసుకునే వ్యవస్థ ప్రభుత్వం దగ్గర ఏమీ కనిపించడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వెబ్సైటుకు వెల్లడించవలసిన విషయం ఎక్కడ కనపడలేదన్నారు. ఆసుపత్రిలో ప్రధానమైన మందులు అందుబాటులో లేక బయట ఎక్కువ ధర చెల్లించి పేద రోగులు కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వం దృష్టి పెట్టి లోపాలను సరిచేయాలని మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు.