Skip to main content

Telugu News Power

అమరజీవి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రికి ఆహ్వానం.

అమరజీవి విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్న ట్రస్ట్ బృందం

అమరావతి: మార్చి,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరజీవి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అధ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను బుధవారం ఆహ్వానించారు. ఇందుకు అమరావతి లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం 6.8 ఎకరాల స్థలం కేటాయించింది. అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం తయారు చేయించారు. ఈ ఈ విగ్రహావిష్కరణ ఈ నెల 16న జరుగుతుంది. పొట్టి శ్రీరాములు గారి 125 వ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ డూండి రాకేష్, ప్రకాష్ ఆర్ట్స్ అధినేత సుబ్బారావు, వేగ జెవెల్లెర్స్ అధినేత నవీన్,
కెపిసి ప్రాజెక్ట్స్ అధినేత అనిల్, ఎన్ఆర్ఐ దేసు గంగాధర్, మరియు సింహాద్రి సుధీర్ బృందం తదితరులు పాల్గొన్నారు.