Skip to main content

Telugu News Power

ఆశా కార్యకర్తల నిరసన.

పాలకొల్లు: మార్చి, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే గేట్ సెంటర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు గురువారం నిరసన తెలిపారు. కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల, న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పరిష్కరించాలని సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విభజన మండల సిఐటియు కన్వీనర్ దేవ సుధాకర్, నీలావతి, సూర్యావతి, కుమారి, సుమలత, శ్రీవర్దిని, శారద, నాగమణి తదితరులు పాల్గొన్నారు.