
పాలకొల్లు, (రూరల్), మార్చి, 9(తెలుగు న్యూస్ పవర్. కాం)
జల వనరుల శాఖ మంత్రిగా నియోజకవర్గ బహుముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉల్లంపర్రు వద్ద పాలకొల్లు ప్రధాన పంట కాలువపై నిర్మించనున్న మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇష్టమైన జలవనరుల శాఖ మంత్రిగా తనను నియమించారని నిమ్మల వెల్లడించారు. తమ శాఖ ద్వారా పలు గ్రామాలకు కలపటానికి ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రెండు లైన్ ల ఈ వంతెన నిర్మాణానికి 12 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ 20 నెలల కాలంలో 287 పనులకు, 193 కోట్ల రూపాయల నిధులు వెచ్చించినట్టు వెల్లడించారు. నియోజకవర్గం లో 189 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు వేశారన్నారు. కాలువల వెంబడి 5 కిలోమీటర్ల మేర కాంక్రీట్ గోడలు నిర్మించినట్టు తెలిపారు. మహిళల కోసం 40 రేవులు నిర్మించామన్నారు. ఏటి కట్టుకున్నప్పుడు 20 కోట్ల తో పటిష్ఠపరిచే పన, 100 కోట్ల వయ్యంతో విజ్జేశ్వరం నుంచి నేరుగా పైపులైన్ ద్వారా కులాయి చెరువుకు నీరు అందే పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో, ఏఎం సి చైర్మన్ కోడి విజయ భాస్కర్, పాముల రజని కుమార్, ఎర్రంశెట్టి పద్మారావు, పెనుమత్స రామభద్రరాజు, ఉన్నమట్ల కాపర్తి , స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.