పాలకొల్లు: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసిన 5వ సెమిస్టర్ ఫలితాలలో చాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 89శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు వెల్లడించారు. నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల ముందుంటుందన్నారు. కళాశాల విద్యార్థులు 9.1నుంచి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన వారు 73మంది ఉన్నారు.కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక విధానాలలో విద్యార్థులను తీర్చుదిద్దుటలోనూ, నూతన విద్యా విధానం -2020 సక్రమంగా నిర్వహించుటలోనూ కళాశాల ముందంజలో ఉందని చైర్మన శ్రీ కెవిఆర్ నరసింహారావు తెలిపారు.ఈ సందర్భంగా ఉత్తమ గ్రేడ్ పాయింట్స్ సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు, సెక్రెటరీ కె.వి సీతారామరాజు, అకాడమిక్ అడ్వైజర్స్ ఏబీఎన్ మూర్తి, నందుల సీతారామరావు, ప్రిన్సిపాల్ డాక్టర్.డి.వెంకటేశ్వరరావు, అధ్యాపకులు ఎన్ రవికుమార్, రాధా మాధవి, జానకి రామయ్య, సత్యవేణి, మీనా, బి విజయలక్ష్మి, తదితరులు అభినందించారు.
విద్యార్థులను పరీక్షలకు తీర్చిదిద్దిన అధ్యాపకులకు కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపినారు.
సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల హవా.
ఫలితాలు సాధించిన విద్యార్థులతో అధ్యాపకులు