పాలకొల్లు: మార్చ్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్)బాలికల విద్య సమాజ ప్రగతికి, కుటుంబ శ్రేయస్సుకు అత్యంత కీలకమని, విద్యను ప్రభుత్వంతో పాటు అందరూ ప్రోత్సహించాలని వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు పేర్కొన్నారు. వాకర్స్ క్లబ్ బుధవారం పట్టణంలోని బి వి ఆర్ యం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 139 మంది పదవతరగతి విద్యార్థినులకు 7 వేల రూపాయల విలువైన పరీక్షా ఉపకరణాలను అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.ప్రభాకర శాస్త్రి అధ్యక్షత వహించారు.క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్ పరీక్షల సమయంలో విద్యార్థినులు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
బి ఆర్ ఎం వి బాలికలకు పరీక్ష సామాగ్రి బహూకరణ.
పరీక్ష సామాగ్రి అందుకున్న విద్యార్థినులతో వాకర్స్ క్లబ్ సభ్యులు