
న్యూఢిల్లీ: మార్చి,11(తెలుగు న్యూస్ పవర్. కాం) రైల్వే భద్రతకు సంబంధించి అతి ముఖ్యమైన ‘కవచ్’ పనుల పురోగతి గురించి రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు దగ్గుబాటి పురందరేశ్వరి లోక్సభలో బుధవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్విని వైష్ణవ సమాధానం ఇస్తూ,
కవచ్ అమలు చాలా క్లిష్టమైన వ్యవస్థ.దీనిలో భాగంగా ఇప్పటివరకు,8,570 కిమీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు,
1,100 టెలికాం టవర్లు నిర్మాణం,
767 స్టేషన్ డేటా సెంటర్లు ఏర్పాటు
6,776 కిమీ ట్రాక్‌సైడ్ పరికరాలు అమర్చడం,లోకోమోటివ్‌లలో కూడా పరికరాల అమలు వేగంగా కొనసాగుతోందన్నారు.
కవచ్ పనులు 1990లలోనే ప్రారంభమవ్వాల్సింది, కానీ 2014లో ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2016లో ఈ ప్రాజెక్ట్ పనులు మొదలయ్యాయి.
కవచ్ మొదటి వెర్షన్2019లో ప్రారంభించారన్నారు.
కవచ్ యొక్క తుది డిజైన్ జూలై 2024లో ఆమోదం పొందింది.
ప్రస్తుతం కవచ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సాంకేతికతను అమలు చేస్తున్న వేగాన్ని ప్రపంచం గమనిస్తోందని మంత్రి సగర్వంగా సభలో తెలియజేసారు.