Telugu News Power

శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల, పాలకొల్లులో ఉద్యోగమేళ.

పాలకొల్లు: మార్చి,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), పాలకొల్లు లో ఈనెల 16 న ప్లేస్‌మెంట్ సెల్ మరియు జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జే కే సి) ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజా రాజేశ్వరి తెలిపారు.
ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ సంస్థలు సన్రైజ్ వర్క్ ఫోర్స్, డయాకిన్, టాటా ఎలక్ట్రానిక్స్, క్యాప్సిటన్ సర్వీసెస్ లిమిటెడ్, హీరో, ఇండో సోలార్, అపోలో ఫార్మసీ వంటి సంస్థలలో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ చేయటానికి కాలేజీ క్యాంపస్ కు కంపెనీ ప్రతినిధులు వస్తున్నారు.
ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు, 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా మరియు డిగ్రీ అర్హత కలిగిన యువత ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. వివిధ సంస్థలలో ఇంటర్న్, ట్రైనీ ఆపరేటర్, వేర్‌హౌస్ ఆపరేషన్స్, అసెంబ్లీ ఆపరేటర్, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, ఫార్మసీ అసిస్టెంట్ వంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.వేతనాలు సుమారు రూ. 18,000 నుంచి రూ. 35,000 వరకు నెలకు లేదా సంవత్సరానికి రూ. 1.38 లక్షల నుండి రూ. 2.42 లక్షల వరకు ఉంటుంది. ఉద్యోగ స్థానాలు హైదరాబాద్, బెంగళూరు, శ్రీ సిటీ, నెల్లూరు, కావలి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలులో ఉన్నాయి.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 16 న ఉదయం 9.00 గంటలలోపు కళాశాల ప్రాంగణానికి హాజరై, తమ బయోడేటా మరియు అవసరమైన సర్టిఫికేట్లతో పాల్గొనవలసిందిగా ప్రిన్సిపాల్ సూచించారు.