Skip to main content

Telugu News Power

పలాసలో కేంద్రియ విద్యాలయ

న్యూఢిల్లీ: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉత్తరాంధ్రకు వరంగా, పలాసలో కేంద్రీయ విద్యాలయం ప్రారంభించనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు శనివారం వెల్లడించారు.
విద్యా సంవత్సరం(2026–27) నుంచి తరగతులు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా
విడుదలయ్యాయి.
శ్రీకాకుళం ప్రాంతానికి ఎంతో ముఖ్యమైన ఈ విద్యాసంస్థను ఆమోదించి,ప్రారంభానికి సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కేంద్రీయ విద్యాలయం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు సాయుధ దళాలలో సేవలందిస్తున్న కుటుంబాలతో పాటు శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఎంతో
ఉపయోగపడుతుందన్నారు.