Telugu News Power

ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.

ఏపీజేఏసీ సమావేశంలో పాల్గొన్న నాయకులు

పాలకొల్లు: మార్చి,15(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎమ్మార్వో కార్యాలయం వద్ద పాలకొల్లు జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు.
అధ్యక్షులు.గుడాలహరిబాబు
జేఏసీ శాఖకు సంబంధించిన ఉద్యోగ. ఉపాధ్యాయ. కార్మిక మరియు పెన్షనర్ల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సమావేశం అధ్యక్షులు గుడాల హరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ కేడర్ల. ఉద్యోగ సంఘాల యొక్క సమస్యలపై చర్చించారు. జేఏసీ అధ్యక్షులు గు డాల హరిబాబు మాట్లాడుతూ . ఉద్యోగుల హక్కుల కోసం. రావాల్సిన పెండింగ్ బకాయిల కోసం. పిఆర్సి కమిటీ నియమించడం కోసం. ఐ ఆర్ కోసం. సిపిఎస్ ఉద్యోగస్తులను ఓపిఎస్ గా మార్చడం కోసం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం. సరెండర్ లీవ్ బకాయిలు విడుదల చేయడం కోసం వారి యొక్క న్యాయమైన డిమాండ్ల సాధనకు ప్రభుత్వం వెంటనే చొరవ చూపి పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమ బాట పడతామని సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా గుడాల హరిబాబు. ఎన్ జి జి ఓ అసోసియేషన్, . జనరల్ సెక్రటరీగా కె. రాజశేఖర్ యు టి ఎఫ్, . కోశాధికారి గుబ్బల ప్రసాద్ ఎన్ జి జి ఓ అసోసియేషన్, ఉపాధ్యక్షులుగా బి రాజకుమార్ ఎస్ టి యు, పి ఎన్ వి ప్రసాద్ పెన్షనర్స్ అసోసియేషన్,. జాయింట్ సెక్రెటరీలుగా.. వై అజయ్ కుమార్ సి ఐ టి యు, ఎన్ వెంకట్రావు ఏపీటీఎఫ్, ఏ. క్రాంతి గ్రామ వార్డు సచివాలయం, కే. చంద్రరావు యుటిఎఫ్, ఈసీ మెంబర్స్ గా.బిహెచ్ రాంబాబు ఎస్టియు, ఎంవి రాజశేఖర్ యుటిఎఫ్, బి ప్రసాద్ ఏ పి టి ఎఫ్, జి లక్ష్మీనారాయణ యుటిఎఫ్, ఎస్ గాయత్రి పంచాయతీ సెక్రెటరీ అసోసియేషన్, ఈ ప్రసాద్ ఎస్ టి యు, ఆర్ కమలనాథ్ యుటిఎఫ్, బి సునీత స్టాఫ్ నర్స్ అసోసియేషన్, కే స్వప్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అసోసియేషన్, విజయ్ బాబు లెక్చరర్స్ అసోసియేషన్, ఎస్ మోహన్ ఆఫీస్ అబార్డినేట్ అసోసియేషన్, సతీష్ బాబు ఆర్టీసీ ఎన్ఎంయూఅసోసియేషన్, కే.నాగరాజు యూటీఎఫ్ లను ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా విచ్చేసిన యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల సాధనకు తమ సంఘం సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఎస్ టి యు రాష్ట్ర అధ్యక్షులు గుత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులకు రావలసిన బకాయిలను వెంటనే చెల్లించుటకు ప్రభుత్వం చొరవ చూపాలని. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షనర్ల హక్కుల కోసం జాయింట్ యాక్షన్ కమిటీ నిరంతరం పోరాటం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు