
పాలకొల్లు: మార్చి ,16 (తెలుగు న్యూస్ పవర్. కాం) పాలకొల్లు కళాపరిషత్ మూడు రోజులపాటు నిర్వహించిన నాటిక పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. రాష్ట్ర జలవలూర్ల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ముగింపు ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై బహుమతి ప్రధానోత్సవం చేశారు.పాలకొల్లు కళా పరిషత్ జాతీయ స్థాయి నాటికల పోటీలలో ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెప్పిన బొమ్మ బహుమతి పొందింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాభారతి కరీంనగర్ వారి ఖరీదైన జైళ్ళు, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహాన ,జ్యూరీ ప్రదర్శన గా ఉషోదయ కళా నికేతన్ కట్రపాడు వారి మంచి మనసులు బహుమతులు పొందాయి. ఉత్తమ నటుడు గా దేవుని చూశా నాటికలో గవరయ్య పాత్ర గారి గంగోత్రి సాయి ,ఉత్తమ నటిగా ఖరీదైన జైళ్ళు నాటికలో రేయమ్మ పాత్రధారిణి బి.నాగరాణి, ప్రతి నాయకునిగా సహాన నాటికలో గుణ వర్ధన్ పాత్రధారి అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి , ఉత్తమ హాస్యనటునిగా నువ్వో సగం నేనో సగం నాటికలో రంగారావు పాత్రధారి టి సుబ్బారావు బహుమతులు అందుకున్నారు. ద్వితీయ ఉత్తమ నటుడుగా మమ్మల్ని బ్రతకనివ్వండిలో ముత్యాలు పాత్రధారి ఈ పవన్ కుమార్, ద్వితీయ ఉత్తమ నటిగా అమ్మ చెక్కిన బొమ్మ నాటికలో అనసూయ పాత్రధారిని జ్యోతిరాజ్ భీ శెట్టి, ఉత్తమ క్యారెక్టర్ నటునిగా అమ్మ చెక్కిన బొమ్మలో శిశి పాత్రధారి భాను ప్రకాష్, క్యారెక్టర్ నటిగా సహాన నాటికలో సహాన పాత్రధారిణి కుసుమసాయి బహుమతులు అందుకున్నారు. ఉత్తమ రంగాలంకరణ దేవుణ్ణి చూసా, ఉత్తమ సంగీతం పి. లీలా మోహన్, ఉత్తమ మేకప్ పి శేషగిరి, జ్యురి బహుమతులు దేవుని చూశా లో ధర్మకర్త పాత్రధారి పి రంగనాయకులు ,నువ్వో సగం నేనో సగం నాటికలో ప్రసాద్ పాత్రధారి ఏ పూరి శ్రీనివాస్ బహుమతులు అందుకున్నారు .న్యాయ నిర్ణీతలుగా లండ రుద్ర మూర్తి భిలాయి, గెద్ద వరప్రసాద్ విజయనగరం, గుత్తు చిన్నారావు శ్రీకాకుళం వ్యవహరించారు. మూడో రోజు జరిగిన సభా కార్యక్రమంలో డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పాలకొల్లులో కళావేదిక నిర్మాణం పూర్తి చేసి కళాకారులకు ప్రదర్శనలు చేసుకోవడానికి అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు ,ఈ సందర్భంగా కళా పరిషత్ వారు మంత్రి రామానాయుడు, భీమవరం చైతన్య భారతి సంగీత, నృత్య నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్, సమాజ సేవకులు,కామిశెట్టి అయ్యప్పనాయుడు లను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి కళాపరిషత్ అధ్యక్షులు కె.వి కృష్ణ వర్మ అధ్యక్షత వహించారు .ఈ ఈ సందర్భంగా కళాపరిషత్ అధ్యక్షుడు కేవీ కృష్ణ వర్మ మాట్లాడుతూ దాతలు సహకారంతో ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నామని అలాగే పాలకొల్లు నాటక సంస్కృతిని కొనసాగించడానికి పరిషత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవాధ్యక్షుడు మేడి కొండ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మానాపురం సత్యనారాయణ, ఉపాధ్యక్షులు విటాకుల రమణ ,కార్యదర్శి జక్కంపూడి కుమార్, కోశాధికారి కొనిజేటి గుప్త, సహాయ కార్యదర్శి రెడ్డి వాసు, కార్యవర్గ సభ్యులు షేక్ పీర్ సాహెబ్,కొల్లి కొండ ప్రసాద్, నడపన శ్రీనివాస్ , జిఎస్ఎన్ రవి, బుద్దాల వెంకట రామారావు, వంగా నరసింహారావు, జవ్వాదిశ్రీనివాస్, కె ఎస్ ఎస్ గోపాలకృష్ణ, అంబటి మురళీకృష్ణ, రాజా తాతయ్య తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల ఈ ఉత్సవాలకు గత మూడు నెలలుగా, గురు అధ్యక్షులు మేడికొండ శ్రీనివాస్ చౌదరి, అధ్యక్షులు కేవీ కృష్ణ వర్మ, నటులు, నాటక పరిషత్ నిర్వహకులు మానాపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్, జిఎస్ఎన్ రవి, వి రమణ, తదితరులు ఎంతగానో శ్రమించి, నాటకాలు ఘనంగా నిర్వహించారు.