పాలకొల్లు: మార్చి, 17 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న, తమ జీవన ఆధారమైన కులవృత్తికి ఇతరులు పోటీ పడటం పట్ల సంఘం నిరసన వ్యక్తం చేసింది. కులవృత్తిని వ్యాపారంగా మార్చడం వల్ల, చిన్న, చిన్నషాపులు నడుపుకునే సామాన్య నాయి బ్రాహ్మణులు ఉపాధి లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతుందన్నారు. బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారం చేసుకోవడం వల్ల తమకు ఎలాంటి నష్టం లేదన్నారు. ప్రస్తుతం పట్టణంలో 500 కుటుంబాలు ఈ కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. పట్టణంలో దాదాపు 150 షాపులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు, పెద్ద గోపురం ఆలయ ధర్మకర్త ఉప్పలపు పెద్దిరాజు, చిక్కాల రామకృష్ణ, ఉప్పలపు శ్రీనివాస్, పి. కృష్ణారావు, కే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో కలిసి తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ తాహశిల్దార్, మున్సిపల్ కమిషనర్ లకు వినతిపత్రం అందజేశారు.
పూలపల్లి నుండి పాలకొల్లు వరకు సాగిన నాయి బ్రాహ్మణ భారీ ర్యాలీ
