Telugu News Power

మృతి చెందిన భారతీయుల కుటుంబాలకు ఆర్థిక సాయం

చెక్కు పంపిణీ చేస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం; మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) విదేశాలకు ఉద్యోగ నిమిత్తం వెళ్లి మరణించిన కుటుంబాల వారికి కలెక్టర్ కార్యాలయం,జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఇన్సూరెన్స్ క్లెయిమ్, మరణ పరిహారం చెక్కులు బాధిత కుటుంబాలకు బుధవారం అందజేశారు.

జుత్తిగ గ్రామానికి చెందిన తాడి సూర్యనారాయణ రెడ్డి కుటుంబానికి రూ.11.98 లక్షలు, సరిగుట్లపాడు గ్రామానికి చెందిన తిరుమాణి కృష్ణ కుటుంబానికి రూ.17.25 లక్షలు పరిహారం అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ఈ ఆర్థిక సహాయాన్ని పిల్లల విద్య, భవిష్యత్తు కోసం వినియోగించుకోవాలని సూచించారు. మీ కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.