Telugu News Power

ఉప ముఖ్యమంత్రి ఉగాది శుభాకాంక్షలు.

విజయవాడ: మార్చి, 18(తెలుగు న్యూస్ పవర్.కాం) ఉగాది సందర్భంగా తెలుగు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ పండుగలో అర్థం పరమార్థం ఉంటుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన కుటుంబ ప్రేమానురా రాగాలు కలయిక పండుగలన్నారు. తెలుగు వార్తలు పండగ ఉగాది, వసంత రుతువు ఆగమనంతో కలిసి రావటం తెలుగు వారికి ఎంతో ఇష్టమైనదన్నారు. పరాభవ నామ సంవత్సరం, జాగ్రత్తగా ఉండాలని, పరాభవానికి దారి తీసే పనులు చేయకూడదని పెద్దలు చెప్పారన్నారు. సందర్భంగా, తెలుగు వారందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తన లేఖ ద్వారా తెలియజేసారు.