
అమరావతి: మార్చి, 22(తెలుగు న్యూస్పవర్.కామ్)
విద్యాశాఖమాత్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా,హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు శెట్టిబలిజ సమాజ అభివృద్ధికి విశేషంగా కృషిచేసిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రజా ప్రభుత్వం అధికారికంగా ఈనెల 20న ఉత్తర్వులు జారీచేసింది. ఇక ఏటా మార్చి 23న దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు.
ఎలుకబడిన తరగతుల (సి) విభాగం, ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారికి నివేదించిన విషయాలు పరిశీలించిన అనంతరం, ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీ దొమ్మెటి వెంకట రెడ్డి గారి జయంతిని ప్రతి ఏట మార్చి 23న రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలి.రాష్ట్రంలోని సచివాలయ విభాగాలు, విభాగాధిపతులు, కలెక్టర్లు మరియు జిల్లా మేజిస్ట్రేట్లు అందరూ ప్రతి సంవత్సరం మార్చి 23న శ్రీ దొమ్మెటి వెంకట రెడ్డి జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా ఘనంగా నిర్వహించాలి. దీనికి సంబంధించిన ఖర్చులు ఆయా విభాగాల నిధుల నుండి భరించాలని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రిన్సిపల్ కార్యదర్శి ఉత్తర్వులు వెలువరించారు.
దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఇక రాష్ట్ర పండుగ.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలుపుతున్న మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ