Telugu News Power

మంత్రి నిమ్మల రామానాయుడు రూ 5 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన .

భీమవరం : మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో సుమారు రూ 5.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి రామానాయుడు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సోమవారం శంకుస్థాపన చేశారు. రూ 2.50 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్డు, రూ 3 కోట్లతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో రాష్ట్రంలోని అన్ని రహదారులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని, రాష్ట్రంలో నిరంతరాయంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి ముందుకు తీసుకెళుతూనే, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పండగ పేరిట ప్రతి గ్రామంలోనూ వాడవాడల సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో గుంటలు లేని రహదారుల నిర్మాణాలను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. తోలేరు గ్రామంలో రూ 2.50 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్డు, రూ. 3 కోట్లతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు‌