-కేంద్రమంత్రి వర్మ. ఆకివీడు:మార్చి,28(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక, పెదపేట రామాలయం వద్ద కూటమి నాయకులు, కార్యకర్తల పైన జరిగిన దాడిని నర్సాపురం ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, భూపతి రాజు శ్రీనివాస వర్మ, శనివారం ఆకివీడులో జరిగిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా, కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శ్రీరామనవమి పండగా రోజు రామాలయం వద్ద జరిగిన దాడి అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. పెదపేట రామాలయ స్థలంలో ఎలాంటి వివాదానికి తావు లేదన్నారు.
అక్కడ తరతరాలుగా పురాతన ఆలయం, రాముని విగ్రహాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
ఏ ప్రాంతంలోనైనా మత మార్పిడులు జరిగినంత మాత్రాన ఆ ప్రాంతంలో ఉన్న హిందూ దేవాలయాల యొక్క పవిత్రత, ఆలయాల చరిత్ర, హిందువుల సంస్కృతి ఏమాత్రం మారవని గమనించాలన్నారు.ఆలయ పునర్నిర్మాణం కేవలం భక్తికి సంబంధించిన అంశమన్నారు. రామాలయ పునర్నిర్మాణం జరిగి తీరుతుందన్నారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అందరి సహకారంతో దివ్యమైన, భవ్యమైన రామాలయాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.
ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ అమలులో ఉన్నందున, జిల్లా యంత్రాంగం సూచన మేరకు రామాలయ సందర్శనను విరమించుకున్నట్టు వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో ఆలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆకివీడు పెదపేట రామాలయ పునర్నిర్మాణానికి సంకల్పం.
ఆకివీడులో కూటమి నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి వర్మ