Telugu News Power

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలు. -పార్టీజాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ కు నివాళులర్పిస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్, పళ్ళ శ్రీనివాసరావు

అమరావతి: మార్చి, 29(తెలుగు న్యూస్ పవర్.కామ్) తెలుగుదేశం పార్టీ,సుశిక్షితితులైన కార్యకర్తలదేనని, వారే అధినేతలని, రాజకీయాల్లో కొత్త సంస్కృతికి శ్రీకారం చుడుతున్నట్టు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్టీ పదాన్ని ఆవిష్కరించి ఆదివారం ఆవిర్భవ సభ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధాని మూడు ముక్కలాట ముగిసింది అని స్పష్టం చేశారు. రాజధాని పట్ల కవి త్వాలు మార్చడానికి వీలు లేకుండా శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చట్టబద్ధతకు త్వరలోనే ఆమోదం తెలుపుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ, ఎందరో సీనియర్ నాయకులతో కలిసి వేదిక పంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. సందర్భంగా తెలుగుదేశం పార్టీకి విశ్వాసపాత్రులైన పలువురు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను పేరు ఘనంగా సత్కరించారు. వారితో కలిసి సామూహిక సహాబంతి భోజనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్ పలువురు కార్యకర్తలతో ముచ్చటించారు. కార్యకర్తల సేవలను గుర్తించి వారికి గౌరవ సత్కారం చేయటంతో వర్షం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ, ఆదివారం ఘనంగా నిర్వహించారు.