స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో డ్రోన్ టెక్నాలజీ స్కిల్ కోర్స్ కు సంబంధించిన కొత్త డ్రోన్ అకడమిక్ అడ్వైజర్స్ కాకినాడ పి.ఆర్. గవర్నమెంట్ స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి డాక్టర్ బి. చక్రవర్తి , డాక్టర్ హరి రామ్ ప్రసాద్, పి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి గారు డ్రోన్‌ను ఎగరవేసి మంగళవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అడ్వైజర్స్ మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థులకు నైపుణ్యత కలిగిన విద్యను అందించడం
అభినందనీయమన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో భాగమైన డ్రోన్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతోందని, ఈ విజ్ఞానాన్ని ఉపయోగించుకుని విద్యార్థులు భవిష్యత్తులో మంచి అవకాశాలను సాధించగలరని తెలిపారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ టీ. కృష్ణ,ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కే. భద్రాచలం, అకాడమిక్ డాక్టర్ వి. యామిని, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎం. రామకృష్ణ, డాక్టర్ వి.డి.వి. విజయలక్ష్మి, తెలుగు విభాగాధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి, శ్రీ పి. శ్రీనివాసరావు, పి.జ్యోత్స్నాశ్రీ,కుమారి, డి.హెప్సిరాణి మరియు ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.
పాలకొల్లు,పశ్చిమ గోదావరి జిల్లా
డ్రోన్ పై శిక్షణ ఇస్తున్న దృశ్యం