Telugu News Power

ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్.

నాక్ 'ఏ' గ్రేడ్ ధృవ పత్రం స్వీకరిస్తున్న ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి.

పాలకొల్లు: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహించిన వార్షిక అకడమిక్ ఆడిట్ మంగళవారంతో ముగిసింది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు, కళాశాలలోని విద్యా ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు పరిశీలించడానికి పిఠాపురం మహారాజా ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, కాకినాడ నుండి విచ్చేసిన అకాడమిక్ అడ్వైజర్స్ బి. చక్రవర్తి, డా. పి. హరి రామ ప్రసాద్, పి.విజయ్ కుమార్ ఈ ఆడిట్ నిర్వహించారు.
కళాశాలలోని అన్ని విభాగాల బోధనా ప్రణాళికలు, విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్లు, మరియు అంతర్గత మూల్యాంకన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అధ్యాపకులు అవలంబిస్తున్న ఆధునిక బోధనా పద్ధతులు, ఐసీటీ వినియోగం మరియు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.కళాశాలలోని ల్యాబొరేటరీలు, లైబ్రరీ, సెమినార్ హాళ్లను సందర్శించి, అటానమస్ హోదాకు అనుగుణంగా ఉన్న వసతులను బృందం సభ్యులు ప్రశంసించారు.
ఆడిట్ ముగింపు సందర్భంగా, జరిగిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి మాట్లాడుతూ, ఈ ఆడిట్ ద్వారా కళాశాల సాధించిన ప్రగతిని అంచనా వేయడానికి, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన విద్యా ప్రమాణాలను నెలకొల్పడానికి అవకాశం కలిగిందని తెలిపారు. ఆడిట్ బృందం అందించిన సూచనలను పాటిస్తూ, జాతీయ స్థాయి గుర్తింపు (నాక్) కోసం మరింత పటిష్టంగా సిద్ధమవనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అకాడమిక్ ఆడిట్ టీం కళాశాలకు “ఎ” గ్రేడ్ ప్రకటించి, వేదికను కళాశాల ప్రిన్సిపల్ కు అందించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ టి. కృష్ణ, ఐక్యూఏసీ కోర్డినేటర్ శ్రీ కె భద్రాచలం, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. వి. యామిని, డా. బి. వెంకటస్వామి, డాక్టర్ ఎం రామకృష్ణ, డా. Ch. ఉషా రాణి, డాక్టర్ వి. విజయ లక్ష్మి,ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.