Telugu News Power

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్.

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి

తాడేపల్లి: ఏప్రిల్, 7 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణపై ఏకకాలంలో నాలుగు చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా పలుచోట్ల ఖరీదైన భవనాలు, బంగారం, వెండి నగదు ఇబ్బడి ముబ్బడిగా కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అధికారిక ఫార్మాలిటీస్ పూర్తిచేసిన తరువాత, రాత్రికి ఆమె అరెస్టు చూపించారు. అత్యంత వివాదాస్పద అధికారిణిగా శాంతి మీడియాలో వార్తలకు ఎక్కారు. సొంత భర్త శాంతి పై తీవ్ర ఆరోపణలు చేశారు. శాంతికి పుట్టిన బిడ్డ తాను దేశంలో లేనప్పుడు ఎలా జన్మించారని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ వాదనలో తన పాత్ర లేదని ఖండించారు. ఆమె ఉద్యోగం రావడం కూడా సక్రమంగా రాలేదని, విజయసాయి రెడ్డి మరో అభ్యర్థిని బెదిరించి ఆ నియామకాన్ని శాంతి పరం చేశారని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దేవాలయ షాపుల కేటాయింపు నిబంధనలు పాటించకుండా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. తన భర్త, ఏసీబీ గుర్తించిన అవినీతి సొమ్ము చాలా తక్కువని, ఇంకా లోతుగా విచారణ చేయాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆమెను ఇంతకాలం ఉపేక్షించడం విమర్శలకు తావిసస్తోంది.