పాలకొల్లు: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) జల వనరులపై ప్రభుత్వం ప్రకటించిన వందరోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా, మంగళవారం స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రామభద్ర రాజు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామభద్రరాజు మాట్లాడుతూ, రాష్ట్ర జలవణుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు మురుగు కాలువల ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని, ఈనెల 15న కాలువలకు నీటి సరఫరా నిలిపివేస్తామని డి ఈ మురళి తెలిపారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు ఆయా పనులు చేయబడతారని తెలిపారు. ఈ పనులు పాత రేట్లకు చేయటం సాధ్యం కాదని సంఘాల అధ్యక్షులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, ఎ. దుర్గాప్రసాద్, బి సాయి శాంతం, జి. సతీష్, నీటి సంఘాల అధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, ఆరవెల్లి రామ శ్రీనివాసరావు, మాతరత్నం రాజు, ఇంటి శ్రీరాముడు, కుక్కల సత్యనారాయణ, దేవుళ్ళ శ్రీరామ్ కోటి మోహన్, దేవరపు దొరబాబు, తానింకి వెంకట కృష్ణారావు, పులకన్న వీరరాఘవులు పాల్గొన్నారు.
సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమీక్ష.
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ రాంభద్ర రాజు