Skip to main content

Telugu News Power

ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం.

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్.కాం) స్థానిక కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం మంగళవారం జరిగింది.
కలెక్టర్ చదలవాడ నాగరాణి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని శాఖల సమన్వయం పనిచేయాలని సూచించారు. కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతుల ప్రక్రియ, రుణాలు మంజూరు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపన కోసం ఇప్పుటి వరకు అందిన
1,727 దరఖాస్తుల్లో 1,707 యూనిట్లకు ఆమోదం తెలిపారు. మరో 312 యూనిట్లు స్థాపన
ఎం ఎస్ ఎం ఈ క్లస్టర్ల ద్వారా అభివృద్ధికి ప్రోత్సాహం నేర్పించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.