Telugu News Power

ఇన్ఫోసిస్ లో ఛాంబర్స్ విద్యార్థులకు ఉద్యోగాలు.

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్.కామ్)
స్థానిక బిఆర్ఆర్ అండ్ జికేఆర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఇద్దరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కే చార్మిలత మరియు పి. రేణుక లక్ష్మి లకు ఇన్ఫోసిస్ లొ ఉద్యోగాలు వచ్చినవి అని కళాశాల చైర్మన్ కె వి ర్ నరసింహ రావు తెలియజేశారు.

కళాశాల చైర్మన్, కెవిఆర్ నరసింహారావు మాట్లాడుతూ, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాల కంపెనీలో ఉద్యోగం లభించడం,కళాశాలలో అందించే అత్యుత్తమ విద్యా బోధనయే కారణమని, కళాశాలలో కమ్యూనికేషన్స్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ , స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ వంటివి నిర్వహించడం వల్లే ఇన్ఫోసిస్ లాంటి అత్యుత్తమ కంపెనీలలో చాంబర్స్ కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పుష్ప గుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కేవీ సీతారామరాజు అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఏబీఎస్ మూర్తి, ఎన్ సీతారామ రావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు, అధ్యాపకులు ఎన్ రవికుమార్, జానకి రామయ్య, మీనా, ఇతర సిబ్బంది విద్యార్థులను అభినందించారు