Telugu News Power

గోదావరి మోక్షధామానికి రూ.3 కోట్లు

మోక్షదామం శంకుస్థాపన కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి

పెనుగొండ: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక సిద్ధాంతం ఘాట్ వద్ద గలశ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న స్మశాన వాటికలో “గోదావరి మోక్ష దామం” నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్ట్ సుమారు ₹3 కోట్ల వ్యయంతో, 62 సెంట్ల విస్తీర్ణంలో నిర్మిస్తారు.
ఈ మోక్ష దామం ద్వారా స్థానిక ప్రజలకు అంత్యక్రియలు నిర్వహించడానికి శుభ్రమైన, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
కార్యక్రమంలో భాగంగా, కలెక్టర్ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు.