Telugu News Power

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

రైతులకు సూచనలు ఇస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు

పాలకొల్లు: ఏప్రిల్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
లంకలకోడేరులో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం గురువారం ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు హాజరై, మాట్లాడుతూ, ట్రక్ షీట్ లేనిదే మిల్లు కి ధాన్యం తోలకూడదని సూచించారు. పౌరసరపురాల శాఖ జిల్లా మేనేజర్ ఇబ్రహీం మాట్లాడుతూ, సకాలంలో రైతుల ఖాతాలకు డబ్బులు వేశామని తెలిపారు. ఎవరైతే ట్రక్ షీట్ లేకుండా మిల్లు కి ధాన్యం తోలితే వాటికి సంబంధించి డబ్బు చెల్లింపు ఆలస్యం అవుతుందన్నారు. ఆర్డీవో దాసి రాజు మాట్లాడుతూ, క్వింటా ధాన్యం మద్దతు ధర 2 వేల 369 కామన్ రకానికి, గ్రేడి ఏ రకానికి 2389 రూపాయలు నిర్ధారించినట్టు వెల్లడించారు. గోనె సంచులు ఆర్ఎస్కే ద్వారా రైతులకు ఇస్తామన్నారు. ఏఎంసి చైర్మన్ కోడి విజయ భాస్కర్ మాట్లాడుతూ, రైతులు ధాన్యం ఏమిల్లు నచ్చితే ఆ మిల్లు కి అమ్ముకుంటానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. ఏడిఏ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉన్నమట్ల కపర్తి, పాముల రజిని కుమార్,సొసైటీ అధ్యక్షులు, నీటి సంఘం అధ్యక్షులు రైతు సోదరుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.