Telugu News Power

తెలంగాణకు రెండు విమానాశ్రయాలు.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్)

తెలంగాణలో విమానయాన రంగాన్ని విస్తరించడానికి చురుగ్గా పనిచేస్తున్నట్టు, కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గురువారం వెల్లడించారు. వరంగల్ విమానాశ్రయానికి మరో మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా మార్గం సుగమమైందన్నారు. రక్షణ శాఖకు చెందిన 360 ఎకరాలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాలు భూమి సేకరిస్తే. ఈ ఎయిర్‌పోర్ట్ రూపుదిద్దుకుంటుందని వివరించారు. రక్షణ శాఖ వ్యూహాత్మక ప్రాంతం కావడంతో, రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని నిర్మిస్తుంది. సివిల్ ఏవియేషన్ శాఖ ప్రత్యేక టర్మినల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఏప్రిల్ 17న ఓఎల్ఎస్ సర్వే నిర్వహించి, ఎయిర్‌ పోర్ట్‌పై మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేస్తామన్నారు.
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశం వివరాలు వెల్లడించారు.