Telugu News Power

రాష్ట్రంలో 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు.

శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి నిమ్మల.

-పెనుమదంలో రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ప్రకటన.

పౌడూరు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతులు పండించిన దాళ్వా ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ప్రకటించారు. స్థానిక పెనుమదం లో రూ.4.49 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు గురువారం మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, రైతుల కోసం 5.40 కోట్ల గోనె సంచులు సిద్ధం చేశామని తెలిపారు. గత ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన రైతులకు డబ్బు ఎన్నాళ్లకు వస్తుందో తెలియని పరిస్థితి లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత,7.83 లక్షల మంది రైతులకు, రూ. 11,757 కోట్ల రూపాయలు, ఒక్కరోజులో రైతుల ఖాతాల్లో వేసిందన్నారు. గత సార్వాలో 48.70 టన్నుల ధాన్యం ప్రభుత్వం సేకరించిందని వివరించారు. అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాలుగా పనిచేస్తున్న,కూటమి ప్రభుత్వం, నిధుల సమస్య ఉన్నప్పటికీ సూపర్ సెక్స్ పథకం అమలు చేస్తుందని తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. గతంలో భయపడి పారిపోయిన పారిశ్రామికవేత్తలు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో తరలి వస్తున్నారని వెల్లడించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే నినాదాలతో వైసిపి పార్టీ మళ్లీ అధికారం రావాలని చేస్తున్న ప్రయత్నాలను, తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని అశీర్వాదించాలని విజ్ఞప్తి చేశారు. గ్రావెల్ రోడ్లకు సుమారు రూ.1.66 కోట్లు, కల్వర్టుల నిర్మాణానికి రూ. 61 లక్షలు, సిమెంట్ గోడల నిర్మాణానికి రూ.2.21 కోట్లతో ప్రారంభించిన పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు ఘన స్వాగతం పలికారు.తాహశీల్దార్, ప్రత్యేక అధికారి,ఎస్ ఎం ఫాజిల్, మండల అధ్యక్షురాలు సబ్బితి సుమంగళి, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, పెనుమత్స రాంభద్ర రాజు, రాష్ట్ర మీడియా అధ్యక్షులు ఉన్నమట్ల కపర్తి, రుద్రరాజు రమేష్ రాజు, ఏఎంసి ఉపాధ్యక్షుడు దాసరి రత్నరాజు, సొసైటీ అధ్యక్షుడు దేవళ్ళ ప్రసాద్, ఎంపీటీసీ మానేపల్లి శ్రీధర్, దేవరపు దొరబాబు, శీలం శ్రీనివాస్ , దొమ్మేటి శ్రీను, కొల్లు రామారావు తదితరులు పాల్గొన్నారు.