అమరావతి: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) అనుబంధ బిల్లులు సమర్పించడానికి గొడుగు పొడిగించాలని కోరుతూ శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ కె. పద్మజను యుటిఎఫ్ రాష్ట్ర సంఘ పక్షాన కలిసి ప్రాతినిధ్యం చేసారు.సప్లిమెంటరీ ఎరియర్ బిల్స్ , ఉద్యోగ విరమణ చేసిన వారి సంబంధించిన బిల్స్ సబ్మిట్ చేయడానికి సైట్ ఓపెన్ కావడం లేదని,ఒకవేళ ఓపెన్ అయినా టోకెన్ నెంబర్ జనరేట్ కానీ విషయాలను డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. రెండు రోజులు పాటు సప్లిమెంటరీ బిల్స్ సబ్మిషన్ కి సమయాన్ని పొడిగించాలని కోరారు. ఇందుకు డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎం టి ఎస్ జీతాలకు సంబంధించి ఉన్న సాంకేతిక సమస్యలను కూడా పరిష్కరించాలని కోరినట్టు వెల్లడించారు.
టెక్నికల్ టీం తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారన్నారు.
డైరెక్టర్ వారిని కలుస్తున్న వారిలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు ఎస్పీ. మనోహర్ కుమార్, కే. శ్రీనివాసరావు వున్నారు..
అనుబంధ బిల్లులు సమర్పించడానికి గడువు పెంచాలి. -యుటిఎఫ్ విజ్ఞప్తి.
డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ వారికి వినతిపత్రం అందజేస్తున్న యుటిఎఫ్ నాయకులు