పెదపాడు: ఏప్రిల్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏలూరు జిల్లా, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా ఈ నూతన భవన నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, ధర్మరాజు, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

