ఉండి: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, నియోజకవర్గ పరిధిలో గల వివాదాస్పద ఆకివీడు, పెదపేట రామాలయం పనులకు సోమవారం ఏకాదశి రోజున శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్మాణానికి వాడే కృష్ణశిల కు రూ. 10 లక్షలు అడ్వాన్స్ గా సరఫరాదారులకు చెల్లించినట్లు ఉపసభాపతి రఘురామ పత్రికలకు తెలియజేశారు. ఆలయ నిర్మాణానికి చందాలిచ్చి ప్రోత్సహిస్తున్న భక్తులకు రఘురామ కృష్ణంరాజు కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండు వారాలలో ఆలయం వద్ద పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆలయానికి సంబంధించిన వ్యవహారాలు దుర్గ ప్రసాద్, మాణిక్యాలరావు చూస్తారని తెలిపారు.
ఆకివీడు పెదపేట రామాలయ పనులకు శ్రీకారం.