Skip to main content

Telugu News Power

“జలధార – జలహారతి”కు కలెక్టర్ శ్రీకారం

పోడూరు; ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పెనుమదం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం “జలధార – జలహారతి” కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం శ్రీకారం చుట్టారు. అప్పి చెరువు పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గుణపంతో తవ్వి పనులు ప్రారంభించారు. కూడికచేత వల్ల
నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతుందన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం పాల్గొన్న కార్మికులకు స్వయంగా చలివేంద్రం ద్వారా దాహార్తిని తీర్చారు. ఈ కార్యక్రమంలో, నర్సాపురం ఆర్డీవో దాసిరాజు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.