Telugu News Power

మహిళా బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరసన.

మహిళా బిల్లు అడ్డుకున్న విపక్షాలపై నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

నిడదవోలు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్) తూర్పు
గోదావరి జిల్లా, నిడదవోలు లో మహిళా రిజర్వేషన్ బిల్‌ ప్రతిపక్షం అడ్డుకోవడానికి వ్యతిరేకం గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన జరిగింది.
బిల్‌ను ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి వ్యతిరేకంగా ఇక్కడ మహిళలతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో స్థానిక మహిళా సంఘాలు, యువత, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. “మహిళల హక్కులు, ప్రజాస్వామ్య గొంతు” అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష వ్యూహాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ బిల్, మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్ల రిజర్వేషన్ కల్పించే చారిత్రక చట్టం. దీన్ని అమలు చేయకుండా ప్రతిపక్షం మోకాలు వడ్డటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. మహిళలకు నాయకత్వ స్థానాలు కల్పించే అవకాశాన్ని కోల్పోయారని ప్రదర్శకులు ఆరోపించారు. ఈ చర్య దేశవ్యాప్తంగా సమానత్వం, ప్రాతినిధ్యం అభివృద్ధికి గొడ్డలి పెట్టు అయ్యిందన్నారు.
ప్రదర్శనలో మాట్లాడుతూ, “ఈ బిల్ అమలు ద్వారా మహిళలు రాజకీయంలో సమాన అవకాశాలు పొంది, దేశ ప్రగతికి దోహదపడతారు. ప్రతిపక్షం ఈ హక్కును అడ్డుకోవడం అన్యాయమైనది” అని నొక్కి చెప్పారు. స్థానిక మహిళలు తమ అనుభవాలను పంచుకుంటూ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సామాజిక, రాజకీయ ఉద్యమాల అవసరాన్ని వివరించారు.
ఈ ప్రదర్శన ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్ వెంటనే పాసు చేయాలని, ప్రతిపక్షం వాయిదాలు వేయడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి ప్రదర్శనలు జరగాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా మహిళా సాధికారతకు కొత్త ఊపిరి పోస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో, జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యే, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, బిజెపి అధ్యక్షులు మాధవ్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పలువురు మహిళలు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు.