
భీమవరం: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) జిల్లాలో రోజుకు మూడు లక్షల లీటర్ల డీజిల్ ఆయిల్ అవసరం కాగా, రోజు 4.5 లక్షల లీటర్ల సరఫరా అవుతుందని ఆదివారం కలెక్టరేట్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇందువల్ల డీజిల్ కొరత ఏర్పడే అవకాశం లేదన్నారు. వ్యవసాయ మధ్య పరిశ్రమకు సంబంధించి ప్రాధాన్యత రంగాలకు తగిన విధంగా డీజిల్ సరఫరాకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రైతులకు విఆర్ఓ ద్వారా కూపన్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. డీజిల్ కొలత లేని కారణంగా, ఎక్కువ పరిమాణాల్లో నిలువ చేసుకోవద్దని సూచించారు. బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా భీమవరం డి మార్ట్ వద్ద గల భారత్ పెట్రోల్ బంక్ జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. కుత్రిము కొరత సృష్టించే వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.