Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు.

చలివేంద్రం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం: ఏప్రిల్, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద పూజలు నిర్వహించి, మజ్జిగ చలివేంద్రం స్థానిక శాసన సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మంగళవారం ప్రారంభించారు . ఈ కార్యక్రమం దేవస్థానం తో పాటుగా భీమవరం ప్రముఖ పారిశ్రామిఖవేత్త విజయ కిరణ్, బయోటెక్ అధినేత రావాడ రామ్మోహన్ రావు, వరలక్ష్మి దంపతులవారి సహకారంతో వేసవి వేడి తగ్గేవరకు కొనసాగించునున్నారు. ఈ సందర్బంగా దాతకు శాసనసభ్యులు అంజిబాబు శాలువ కప్పి,అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ రావు, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి జానకి నాగ శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతిన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,పాపోలు ఏడుకొండలు పాల్గొని దాతలకు ప్రసాదం అందచేసారు.