అమరావతి: మే,2(తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రభుత్వ ఉద్యోగులు దైవాంశ సంభూతులు కాదని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులు
ప్రజా సేవకులు మాత్రమేనని గుర్తు చేసింది.హైకోర్టు హాల్లో న్యాయమూర్తి ఎదుట బాధ్యతారాహిత్యంగా, గర్వంగా ప్రవర్తించిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. శ్రీరాములు పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ అటవీ దళాల అధిపతి డాక్టర్ పి.వి. చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు.సూర్య రాక్స్ అధినేత గుత్తా హరి కృష్ణ దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా మార్చి 3న హైకోర్టులో జరిగిన పరిణామాలు ఈ చర్యలకు దారితీశాయి. విచారణ సమయంలో న్యాయమూర్తి ఎదుట శ్రీరాములు ప్రవర్తనపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కోర్టులో అనుచిత ప్రవర్తన, న్యాయమూర్తి ఎదుట క్రమశిక్షణా రాహిత్యంతో, అహంకారంగా వ్యవహరించడం,కీలక ఉమ్మడి సర్వే నివేదికలో 3 నుండి 18 పేజీలు జత చేయకపోవడం
విరుద్ధ స్టేట్మెంట్లు: ఒకే అంశంపై కోర్టుకు భిన్న సమాచారం ఇచ్చి శాఖ ప్రతిష్ట దెబ్బతీయడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
చిత్తూరు జిల్లా అటవీ అధికారి, అనంతపురం కన్జర్వేటర్ నివేదికల ఆధారంగా ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 ప్రకారం సస్పెన్షన్ విధించారు.శ్రీరాములు పుంగనూరులోనే ఉండాలి.
అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం విడిచివెళ్లరాదు.
నిబంధనల ప్రకారం సగం జీతంతో కూడిన భత్యం అందుతుంది
ఇక పుంగనూరు ఎఫ్ ఆర్ ఓ అదనపు బాధ్యతలను తాత్కాలికంగా మరొక అధికారికి అప్పగించాలని అనంతపురం కన్జర్వేటర్కు ఆదేశాలు జారీ అయ్యాయి.
అటవీ శాఖ అధికారిపై హైకోర్టు ఆగ్రహం. ఎఫ్ ఆర్ ఓ జి. శ్రీరాములపై సస్పెన్షన్ వేటు
సస్పెండ్ అయిన ఎఫ్ ఆర్ ఓ శ్రీరాములు