Skip to main content

Telugu News Power

పదో తరగతి ప్రతిభావంతులకు సత్కారం.

పదో తరగతి టాపర్ ను సన్మానిస్తున్న దృశ్యం

యలమంచిలి:మే,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) బుంగ తాతబ్బాయ్ ఫౌండేషన్ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు బిఇ తిరుమల రాజు చేస్తున్న సమాజ సేవా కార్యక్రమాలు అభినందనీయం అని మట్లపాలెం సర్పంచ్ చల్లా విశ్వేశ్వరరావు అభినందించారు. చదువుకునే విద్యార్థులు అంటే తిరుమల రాజు కి ఏంతో ఇష్టమని అందుకే ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులకు, విద్యా సామాగ్రి అందజేసి ప్రోత్సాహిస్తారని కొనియాడారు. మట్లపాలెం ఉన్నత పాఠశాల లో చదివి పదవతరగతి పరీక్షలలో జిల్లా టాప్ ర్యాంకర్ గా నిలిచిన అంబటి జయశ్రీ,, మండలంలో రెండవ ర్యాంకు సాధించిన బుంగ శిరీష, మూడవ ర్యాంకు సాధించిన రాచమళ్ళ మాధురి లను ఆదివారం సన్మానించచారు. కాలేజీ బ్యాగ్స్, విద్యా సామాగ్రి అందజేశారు.తిరుమలరాజు మాట్లాడుతూ, ప్రతి తల్లి తండ్రుల పిల్లలను ఖచ్చితంగా చదివించాలని అందుకు కావలసిన సౌకర్యాలు సమకూర్చుస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బిషప్ దానియేలు దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ బుంగ వరాలరాజు, గ్రామ పెద్దలు అరిగెల రవి, యడ్ల రత్నం రాజు, గెడ్డం సునీల్ గవాస్కర్, వడ్డీ భోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.