Skip to main content

Telugu News Power

పంచారామ క్షేత్రం క్షీరా రామంలో గణపతి హోమం

శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న భక్తులు

పాలకొల్లు: మే,5 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో మంగళవారం సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమమం నిర్వహించారు. ఈ పూజలో 17 మంది దంపతులు పాల్గొన్నారు. శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం వద్ద భక్తులచే అభిషేక పండితులు భమిడి పాటి వెంకన్న పూజలు జరిపించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. వీరికి దేవస్థానం కార్యనిర్వాణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు శేష వస్త్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ ధర్మకర్తలు, ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణప్ప ,సూర్య అనిల్ కుమార్ , అర్చకులు వీరబాబు సూపర్డెంట్ వాసు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.