Telugu News Power

అధికార మార్పిడితో మారిన భారత రాజకీయ ముఖచిత్రం.

దేశాన్ని చుట్టేస్తున్న బిజెపి

జనరల్ డెస్క్: ఏప్రిల్,4(తెలుగు న్యూస్ పవర్. కాం)
ఈ ఏడాది, ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల చారిత్రాత్మక ఫలితాలు భారతదేశ రాజకీయ భవిష్యత్ చిత్రాన్ని ఆవిష్కరింపచేసాయి.
బెంగాల్‌లో బీజేపీ చరిత్ర సృష్టించింది, తమిళనాడులో టీవీకే షాక్ ఇచ్చింది, కేరళలో ఎర్రజెండా అధికారం పోగొట్టుకొని, దేశంలో కమ్యూనిస్టులకు ఉన్న ఒకే ఒక్క అధికార పీఠం 50 ఏళ్ల తరువాత కుప్పకూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారం చేపట్టి,
తన ఉనికిని కాపాడుకుంది. పుదుచ్చేరి ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టి, యానంలో ఈసారి మల్లాడికి పట్టం కట్టారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు భారత ముఖచిత్రాన్ని మార్చివేసాయి‌. మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.అస్సాం 126, కేరళ 140, తమిళనాడు 234, పశ్చిమ బెంగాల్ 294, పుదుచ్చేరి 30 స్థానాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలు2029 కి ముందు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కీలక పరీక్షగా ఈ ఫలితాలు నిలిచాయి. పశ్చిమ బెంగాల్ మమత అడ్డ లో బిజెపి తిష్ట వేసింది. ఎన్నికల రోజు అతి ఉత్కంఠభరితమైన కథ పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించింది. 294 స్థానాల అసెంబ్లీలో బీజేపీ 183 స్థానాలు గెలిచింది, తృణమూల్ కాంగ్రెస్ 91కి పరిమితమైంది. మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ 15 సంవత్సరాల పాలనకు బీజేపీ తెర వేసింది.
ఓటర్ టర్నౌట్‌ 92 శాతం తో బెంగాల్ ఫలితాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. బీజేపీ నేత శిషిర్ బజోరియా మాట్లాడుతూ,
“ఈ విజయం పార్టీకి కాకుండా బెంగాల్ ప్రజలకు చెందినది.దీది పాలన ప్రజలు భరించలేకపోయారన్నారు. అధిర్రంజన్ చౌధరీబహరంపూర్‌లో ఓడిపోవడం కాంగ్రెస్‌కు షాక్ కు ఇచ్చింది.
తమిళనాడులో విజయ్ రాజకీయ బ్లాక్‌బస్టర్
తమిళనాడులో అతి పెద్ద కుదుపు ఇచ్చింది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తన తమిళగ వెట్రి ఖజగం (టీవీకే) 234 స్థానాల్లో 109 గెలిచింది. ఏఐఏడీఎంకే 64, డీఎంకే 44. గెలిచాయి.
ఎగ్జిట్ పోల్స్ డీఎంకేకు 122-145 స్థానాలు, టీవీకేకు 0-6 అని అంచనా వేశాయి. కానీ టీవీకే డీఎంకే కోటల్లోకి దూసుకెళ్లింది. సీఎం ఎంకే స్టాలిన్ కొలతూరులో అవమానకర రీతిలో ఓడిపోయారు. ఉపముఖ్యమంత్రి ఉధయనిధి స్టాలిన్ చెప్పుక్-తిరువల్లికెనిలో 7,140 అత్తెసరు ఓట్లతో గెలిచారు.
డీఎంకే ప్రతిపక్ష స్థాయికి కూడా చేరలేదు.
కేరళలో కాంగ్రెస్ యూడిఎఫ్ మార్పు ఓటు
లెఫ్ట్ 10 సంవత్సరాల పాలనకు పలికింది. దీంతో దేశంలో కమ్యూనిస్టుల అధికారశకం ముగిసింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఇది”చరిత్రాత్మక విజయం అన్నారు. కేరళం140 స్థానాల్లో యూడిఎఫ్ 60 గెలిచింది, సిపిఆర్(ఎం) 25-28, ఐయూఎంఎల్ 23, సిపిఐ 9-10, కెఈసీ 7. ఇక్కడ79.63 శాతం ఓటింగ్ నమోదయింది.
అస్సాంలో బీజేపీ హ్యాట్-ట్రిక్ సాధించింది.
అస్సాం‌లో 126 స్థానాల్లో బీజేపీ 82 గెలిచింది, కాంగ్రెస్ 24, బీఓపీఎఫ్ 10, ఏజీపీ 9, ఏఐయూడీఎఫ్ 2. తమ ఖాతాలో వేసుకు న్నాయి.
సీఎం హిమంత బిశ్వ సర్మా జలుక్‌బారీలో 63,000 భారీ మెజారిటీతో గెలిచారు. ఇక్కడ 85.38 శాతం ఓటింగ్ నమోదయింది. కాంగ్రెస్ కు 2016 వరకు ఈ రాష్ట్రం కంచుకోట, సర్మా బీజేపీలో చేరడంతో మార్పు సంభవించింది.
పుదుచ్చేరి లో16స్థానాల్లో విజయం సాధించ ఏఐఎన్ఆర్సీ, బీజేపీ తో కలిసి అధికారం కైవసం చేసుకుంది. ఇక్కడ 90 శాతం ఓటింగ్ జరిగింది.
ఎన్నికల ముందు : ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో బెంగాల్‌లో 90 లక్షల మంది ఓటర్లు తొలగించబడ్డారనివివాదం లో చిక్కుకుంది.
బీజేపీ దేశవ్యాప్తంగా బలపడింది. తమిళనాడులో తారాపథం నుంచి కొత్త రాజకీయ నక్షత్రం ఆవిర్భవించింది, దక్షిణాదిలో కాంగ్రెస్ మరో రాష్ట్రం అధికార పగ్గాలు చేపట్టింది. తమిళనాడు విషయంలో షెపాలజిస్టులు అంచనాలు తప్పాయి.