Skip to main content

Telugu News Power

జనసేన రాష్ట్ర కమిటీ ఏర్పాటు.

మంగళగిరి: మే, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాష్ట్ర కమిటీ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయన నివేదిక పార్టీ అధిష్టానానికి అందించవలసి ఉంది. ఈ కమిటీలో, కొణతాల రామకృష్ణ, (అనకాపల్లి), పంచకర్ల రమేష్ బాబు (పెందుర్తి),ఆరని శ్రీనివాసులు (తిరుపతి) పంతం నానాజీ (కాకినాడ గ్రామీణ), బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం) సామినేని ఉదయభాను, (ఎన్టీఆర్ జిల్లా) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సిహెచ్. వంశీకృష్ణ (విశాఖ, దక్షిణ), కొటికలపూడి గోవిందరావు (ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా). రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు ఈ మేరకు నియామక పత్రాలు అందజేశారు.