Telugu News Power

కోనసీమ జిల్లా వానపల్లిలో పెళ్లి భోజనం తో 50 మందికి అస్వస్థత.

ఆసుపత్రిలో చేరిన పరామర్శిస్తున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే బండారు
అస్వస్థకుగురైన వారి పరిస్థితి వివరిస్తున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

వానపల్లి: మే,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లి శివారు రామ్మోహన్రావుపేటలో వెళ్లి భోజనం తిన్న 50 మంది అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆసుపత్రికి వెళ్లి, అనారోగ్యం పాలైన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళిత ఓడలో ఒకే గ్రామానికి చెందిన, వధూవరులు పెళ్లి జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మాంసాహార విందు భుజించిన వారికి ఫుడ్ పాయినింగ్ జరిగిందని తెలిపారు. తక్షణమే వీరిని వానపల్లి ప్రభుత్వాసుపత్రికి, కొంతమందిని కొత్తపేట ఆసుపత్రికి తరలించినట్టు వివరించారు. నాకు వైద్యులు అస్వస్థతకుడైన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపినట్టు వెల్లడించారు. అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని, ఇంకా అవసరమైతే రాజమండ్రి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.