Telugu News Power

జిల్లా కలెక్టర్ నాగరాణికి ముఖ్యమంత్రి ప్రశంసలు.

కలెక్టర్ల సమావేశం (4,7) ముఖ్యమంత్రికి ప్రణాళిక వివరిస్తున్న కలెక్టర్ నాగరాణి

అమరావతి: మే,7(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా “సర్క్యులర్ ఎకానమీ బ్లూప్రింట్” రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల తో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇచ్చిన వినూత్న ప్రణాళిక పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి అర్థం చేశారు. వ్యవసాయ, ఆక్వా, పశుసంపద వ్యర్థాలను బయో ఉత్పత్తులుగా మార్చి వేస్ట్ టు వెల్త్,(వ్యర్థం నుంచి అర్థం)మోడల్‌తో పారిశ్రామిక అభివృద్ధికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కార్యాచరణ వివరించారు. బయోగ్యాస్ ప్లాంట్లు, ఆక్వా వ్యర్థాల విలువ ఆధారిత ఉత్పత్తులు, కోకో చాక్లెట్ బ్రాండ్లు, వరి ఆధారిత పరిశ్రమలతో జిల్లాను “జీరో వేస్ట్ ఇండస్ట్రియల్ మోడల్”గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సీఎం అభినందించారు. జిల్లా నిర్దేశిత లక్ష్యాలలో రాష్ట్ర సగటు వంటి కొన్ని విషయాల్లో ముందు ఉన్నట్టు వివరించారు. ఈ జిల్లా ఖరీదైన వ్యవసాయ భూములు, ఆక్వా రంగాల్లో అభివృద్ధి చెంది ఉండటం వల్ల, పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతానికి రావటానికి అంతగా ఆసక్తి చూపటం లేదని తెలిపారు. జిల్లాలో ఉన్న సుమారు 200 రైస్ మిల్లు సీజన్లో మాత్రమే పని చేస్తున్నాయన్నారు. వీరికి విలువ ఆధారిత ఉత్వత్తుల జోడింపు అంటే అంశాలపై కారిశాల నిర్వహించినట్టు వెల్లడించారు. జిల్లా ప్రగతి గురించి ముఖ్యమంత్రికి వివరించారు.