Telugu News Power

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ కు చికిత్స.

ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలిస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం: మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. కలెక్టర్ కాలు బెణకడం వల్ల, ఒక సామాన్య వ్యక్తిగా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. ఓపిలో పేరు నమోదు చేసుకున్నారు. ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీసి చికిత్స అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యశాల గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి చెందారు. ఆసుపత్రి పరిశుభ్రత, మందులు ఉచితంగా అందుతున్నాయా లేదా, సిబ్బంది పనితీరు గురించి నిశితంగా సమాచారం తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రైవేటు ఆసుపత్రిలో ధీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలు ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.