Telugu News Power

మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. -మంత్రి ఫరూక్

షాదీఖానా శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న మంత్రి ఫరూక్, మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం మైనారిటీల, అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ పేర్కొన్నారు. స్థానిక నియోజకవర్గంలో రూ.4.52కోట్ల
తో పూ పోడూరు మండలం, జున్నూరు గ్రామంలో, పట్టణంలోని 27 వార్డు లో ముస్లిం కళ్యాణ మండపం
రూ. 1.93 కోట్లతో నిర్మించనున్న పనులకు మంత్రులు ఫరూక్, నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా, 27వ వార్డులో జరిగిన బహిరంగ సభకు మంత్రి నిమ్మల రామానాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, నంద్యాలలో నిమ్మలతో కలిసి పని చేసిన సందర్భంగా, ఆయనలో పరిణితి చెందిన రాజకీయవేత్తను గుర్తించినట్టు తెలిపారు. మైనార్టీ కమిషన్ తొలి చైర్మన్,టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, నిమ్మల రామానాయుడు మంత్రిగా ఉండటం, పాలకొల్లు నియోజకవర్గం వరకు మాత్రమే కాక, యావత్ రాష్ట్రానికి అదృష్టంగా భావించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ, నిమ్మల అసాధారణంగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ పాలకొల్లు ఎంజి రోడ్ విస్తరణకు సంబంధించి ఎదురైన సమస్యను పరిష్కరించినందుకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు. షరీఫ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం మైనార్టీలకు రూ.3,766 కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమం కోసం ఈ 20 నెలల కాలంలో ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైనార్టీ ప్రజలకు రాజకీయంగా తగిన అవకాశాలు కల్పించడం కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా వారికి పదవులు కల్పిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో శాసనమండలి చైర్మన్ గా ఉన్న షరీఫ్ పై జరిగిన రాక్షసి దాడి పై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. షరీఫ్ మూడు రాజధానుల విషయంలో రాష్ట్రాన్ని కాపాడారని కొనియాడారు. వైసిపి మూకలు భౌతిక దాడికి పాల్పడిన, అష్టదిగ్బంధనం చేసి ఎవరిని తన వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నా, వైసిపి దుశ్చర్యను ధైర్యంగా ఎదుర్కొని రాష్ట్రానికి మేలు చేసిన గొప్ప నాయకుడు అన్నారు. కులం ,మతం, వ్యక్తిగతంగా ఆయనపై చేసిన దాడిని మంత్రి ఖండించారు. మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం ఠూ
కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి ఫరూక్ తో కలిసి జున్నూరు నుంచి పాలకొల్లు 27 వార్డు వరకు భారీ ర్యాలీ మండుటెండలో ఉత్సాహంగింది. ఈ సందర్భంగా, ఫరూక్, షరీఫ్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో, మహమ్మద్ జానీ, షేక్ సిలర్, ముస్లిం పెద్దలు,
మాజీ ఎమ్మెల్సీ రామ్మోహన్రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, పెచెట్టిబాబు, గండేటి వెంకటేశ్వరరావు, ఉన్నమట్ల కాపర్ది, పాముల రజనీ కుమార్, మామిడి శెట్టి పెద్దిరాజు, బొప్పన హరి కిషోర్, బోనం నాని, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు,