Telugu News Power

మండే ఎండల్లో విరబూసిన మేపుష్పాలు.

వికసించిన మేపుష్పాల మధ్య గంటి దంపతులు

ముమ్మిడివరం:మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) పకృతి అందాలకు నిలయమైన, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం, సిహెచ్. గున్నేపల్లి గ్రామంలో విరిసిన మేపుష్పాలతో అందర్నీ ఆకట్టుకుంటున్నది. విశ్రాంత బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి గంటి సత్యనారాయణ మార్త ఇంటి ఆవరణ వేలాదిగ మేపుష్పాలు విరబూసి అద్భుతమైన సుందర దృశ్యాన్ని ఆవిష్కరించాయి. స్థానికులు, ప్రకృతి ఆరాధకులు ఆహ్లాదకర ఈ పుష్పాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్పాల మధ్యలో నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. స్వీడన్ దేశంలో ఉన్న తమ బంధువుల నుంచి రెండు దుంపలు తెచ్చి నాటామని మార్త తెలిపారు. ఈ ఏడాది పుష్పాలు విరివిగా విరబూసాయని సంతోషం వ్యక్తం చేశారు. అందమే, ఆనందమని సందర్శకులకు నయనానందకరంగా, కనువిందు చేస్తున్నాయి. ఈ సందర్భంగా, మార్త అభిరుచిని అందరూ అభినందిస్తున్నారు.