Telugu News Power

బిడ్డను కనొద్దు, కోర్టు తీర్పు.

మదురై: మే, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) బిడ్డను కనాలన్న ఓ భార్య పిటిషన్ మద్రాస్ హై కోర్ట్, మధురై ధర్మసనం కొట్టివేసింది. స్థానిక జైలు సూపరిండెంట్ తీసుకున్న, తిరస్కరణ నిర్ణయం సరైనదేనని కోర్టు సమర్థించింది. ఈ తీర్పుకు సంబంధించి, వివరాలలోకి వెళితే, తన భర్త ముత్తుమణి ద్వారా సంతానం కోసం, సంతాన సాఫల్య కేంద్రం (ఐ వి ఎఫ్) ద్వారా బిడ్డను కనడానికి పెరోల్ పై విడుదల చేయవలసిందిగా అర్జీ పెట్టుకుంది. అయితే, జైలు అధికారులు, ముత్తుమణి హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. ఇతని నేల చరిత్రను బట్టి, ప్రస్తుతం జైలులో జీవితకైదు అనుభవిస్తున్నాడు. పుట్టబోయే బిడ్డ నేరస్తుని, కళంకిత బిడ్డగా సమాజంలో ముద్రపడి మనుగడ సాగించటం బిడ్డకు శాపంగా మారుతుందని జైలు వర్గాలు భావించాయి. అభం, శుభం తెలియని బిడ్డకు నేరచరిత్ర ఆపాదించడం తగదని వారించారు. దీనిపై కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తులు, జైలు అధికారుల నిర్ణయాన్ని సమర్థిస్తూ, బిడ్డను కనాలన్న నేరస్తుని భార్య వేసిన పిటిషన్ కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.