Telugu News Power

టౌన్ హాల్ అధ్యక్షుడిగా పోలిశెట్టి.

టౌన్ హాల్ నూతన అధ్యక్షులు పోలిశెట్టి రాధాకృష్ణ

పాలకొల్లు: మే,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రతిష్టాత్మక పాలకొల్లు టౌన్ హాల్ అధ్యక్షునిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం, ప్రముఖ న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ ఏకగ్రీవం ఎన్నికయ్యారు. గురువారం జరిగిన ఈ ఎన్నికకు, పిల్లా బాలాజీ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కార్యదర్శిగా, కాజ సొసైటీ అధ్యక్షులు బంజారా నర్సింహారావు (పెదకాపు) , కోశాధికారిగా కంచర్ల మాణిక్యం, జాయింట్ సెక్రటరీగా, గుణ్ణం వెంకటరత్నం నాయుడు, కార్యవర్గ సభ్యులుగా, చింతా సోమయ్య, అడబాల సూర్యచంద్రరావు, అబ్బిరెడ్డి, ద్వారంపూడి వెంకట సూర్యనారాయణ రెడ్డి, వెంకట నాగేశ్వరరావు, ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.