Telugu News Power

రైలులో ప్రయాణిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మే, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా, పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు శుక్రవారం రైలు బండిలో ప్రయాణించారు. వాహన రహిత రోజు (నో వెహికల్ డే) పురస్కరించుకొని, క్యాబినెట్లో ముఖ్యమైన స్థానంలో ఉండి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కూడా అయినా మంత్రి నిమ్మల ప్రోటోకాల్ పక్కనపెట్టి, రైలు పెట్టెలో సామాన్లతో కలిసి ప్రయాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మంత్రికి అభిమానంతో వారు పెట్టిన పులిహార భుజించారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఉదయం తన క్యాంపు కార్యాలయం నుంచి సైకిల్ పై బయలుదేరి, ఉదయం 6 గంటల బండికి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. మంత్రి టిక్కెట్ కూడా తీసుకుని, తన కార్య స్థానానికి బయలుదేరి వెళ్లారు. స్వయంగా మంత్రి తమతో సామాన్య ప్రయాణికుడిగా తమతో పాటు కూర్చుని ప్రయాణించటం తోటి ప్రయాణికులకు ఒకింత ఆశ్చర్యం, ఆనందం వారి నవ్వుల్లో కనిపించింది. మంత్రితో ప్రయాణికులు ఫోటోలు తీసుకున్నారు.