Telugu News Power

“కలలా ఉంది ఈ క్షణం” సినిమా షూటింగ్.

చిత్ర యూనిట్ సభ్యులు

పాలకొల్లు: మే, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఉల్లంపర్రు మాంటిసోరి ఫంక్షన్ హాల్ లో “కలలా ఉంది ఈ క్షణం” సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా, ఎస్ బి వి ఏ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాలకొల్లు, నరసాపురం, భీమవరం పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా దర్శకులు మీసారపు వెంకీ మాట్లాడుతూ, ఈ చిత్ర కథ ఇంతవరకు రాని ఇతివృత్తంతో కొత్త తరహాలో తెరకెక్కిస్తున్నట్టు వెల్లడించారు. కొత్త,పాత నటులతో పాటు జబర్దస్త్ కళాకారులతో ఈ చిత్రం నిర్మిస్తున్నట్టు తెలిపారు. గతంలో తాను తీసిన 25 లఘు చిత్రాలలో తన ప్రతిభావంతమైన దర్శకత్వంపై నమ్మకంతో నిర్మాతలు అవకాశం ఇచ్చినట్టు తెలిపారు. నిర్మాతలు వెంకటేష్, హేమంత్ మాట్లాడుతూ ఖర్చులకు వెనుకాడకుండా, మంచి చిత్రం తీయాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఎస్ కే సలీం సంగీత సారథ్యంలో చక్కని సంగీతంతో నాలుగు పాటలు ఉంటాయని తెలిపారు. ఈ చిత్రంలో నాయకుడు పి నారాయణ మూర్తి రాజు, నాయకి జయ శ్రీ ఉష నటిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో సినిమా సందడి నెలకొంది.